Home Adyatmikam ఏ క్రతువు ఆచరించాలన్న ఉపనయనం తప్పనిసరి.కుర్తాళా పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామి

ఏ క్రతువు ఆచరించాలన్న ఉపనయనం తప్పనిసరి.కుర్తాళా పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామి

12
0

రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్ మే 4.

శాస్త్రంలో చెప్పబడిన ఏ సంస్కారాలైనా క్రతువులు కానీ ఆచరించాలన్న ఉపనయనమై ఉండాలని కుర్తాళా పీఠం ఉత్తరాధికారి దత్తతేశ్వర నంద భారతి స్వామి అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో దత్తతేశ్వర నంద భారతీ స్వామి సమక్షంలో రాష్ట్రస్థాయి బ్రాహ్మణ ఉచిత సామూహిక ఉపనయన మహోత్సవం అలకాపురి కాలనీ పార్క్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తశ్వరానంద భారతి స్వామి అనుగ్రహ భాషణం చేశారు. బ్రాహ్మణుడు అనిపించుకోవాలంటే అది ఉపనయన సంస్కారంతోనే సాధ్యం అన్నారు.

ఉపనయనం కాకుంటే నామమాత్రం బ్రాహ్మణుడిగానే పర్యవేస్తారని ఉపనయన సంస్కారం అయ్యింది అంటే మరో జన్మ పొందినట్లే అని అన్నారు ఈ జన్మ అమ్మవారి అనుగ్రహం పొందిన జన్మగా స్వామీజీ అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ నిత్యం త్రికాల సంధ్యావందనం చేయాలని గాయత్రీ మంత్రం గొప్పదనం మీకే అర్థమవుతుందన్నారు. గొప్ప శక్తి గల మంత్రం గాయత్రీ మంత్రమని సనాతన ధర్మం వేదాలను పరిరక్షించడానికి ప్రతి హిందువు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాఖ్య అధ్యక్షులు మునిపల్లి శ్రీనివాస అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంధ్యావందనం శిక్షణ సమితి అధ్యక్షులు కల్వకొలన శ్రీరామచంద్రమూర్తి, బాస్ కోఆర్డినేటర్, బసవరాజు శ్రీనివాస్, అలకాపురి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారణాసి వంశీ, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, భాస్కర మూర్తి, వక్క లంక శ్రీనివాసరావు, రఘునందన్, నాగరాజు, పవన్ కుమార్, పార్థసారథి, నవీన్ కుమార్, కళ్యాణి నీలిమ తదితరులు పాల్గొన్నారు.