Home Uncategorized సమాజాన్ని కదిలించిన మహానుభావుడు కారల్ మార్క్స్

సమాజాన్ని కదిలించిన మహానుభావుడు కారల్ మార్క్స్

11
0
  • మార్క్సిజం మార్గంలోనే ప్రజా పోరాటాలు
  • సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మే 5:

ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన మహత్తర తత్వవేత్త కారల్ మార్క్స్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ముకుందలాల్ మిశ్రా భవనంలో కారల్ మార్క్స్ 209వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ మార్క్స్ ప్రతిపాదించిన గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, వర్గపోరాట సిద్ధాంతాలు ప్రపంచాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. “ప్రపంచ కార్మికులారా ఏకంకండి… పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప” అనే సందేశంతో కమ్యూనిస్టు ప్రణాళిక కార్మిక వర్గానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు.
‘దాస్ కాపిటల్’ వంటి గ్రంథాల ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థ లోపాలను వెలికి తీసి కార్మిక వర్గానికి దిశానిర్దేశం చేశారని అన్నారు. మార్క్స్ మరణించి దశాబ్దాలు గడిచినా ఆయన ఆలోచనలు ఇంకా ప్రస్తుతానికి సైతం వర్తిస్తూనే ఉన్నాయని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను బలహీనపరుస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులను కట్టుబానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. రైతు, కూలీలకు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.
మార్క్స్ స్ఫూర్తితో జిల్లాలో ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు డి. నరేష్ పటేల్, రాయికంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్, కాంపెళ్లి అరవింద్, ఏ శివ, యూ. మానస తదితరులు పాల్గొన్నారు.