Home POLITICS బెంగాల్ అస్సాం పుదుచ్చేరి లో బిజెపి ఘన విజయానికి సంబరాలు.బిజెపి కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలను...

బెంగాల్ అస్సాం పుదుచ్చేరి లో బిజెపి ఘన విజయానికి సంబరాలు.బిజెపి కో-ఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలను శంకర్ రెడ్డి,

10
0

రంగారెడ్డి ప్రతినిధి ఆర్గాన్ న్యూస్, మే 4.

బెంగాల్,అస్సాం, పుదుచ్చేరి, లలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం లోని బాలాపూర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ బెంగాల్ అస్సాం పుదుచెర్లలో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తమిళనాడులో సనాతన ధర్మ ద్రోహు డీఎంకే పార్టీ ఓటమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, బిజెపి కోఆపరేటివ్ సెల్ కన్వీనర్ కొలను శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచుతూ బిజెపి జిందాబాద్ జై మోడీ అంటూ టపాకాయలు కాల్చడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి కోపరేటివ్ సెల్ కన్వీనర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని వారిపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని అన్నారు అందుకే ఈ ఘన విజయాలు తమ పార్టీకి ప్రజలు అప్పగించారని అన్నారు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. దక్షిణ భారతదేశంలో బిజెపి రోజురోజుకు బలపడుతుందని అన్నారు. పార్టీని ఆదరించిన రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నేతలు మాజీ కార్పొరేటర్ కిషోర్, జిల్లెల్ల ప్రభాకర్ రెడ్డి, శశిధర్, భూషణం, దాసు, విజయ్ కుమార్, జి అరుణ, జి సూర్యప్రకాష్ సింగ్ జయ కాంతా రాఘవేంద్ర రాజేష్ రెడ్డి ఎస్ భాస్కర్ భూమన తదితరులు పాల్గొన్నారు.