Home agriculture ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ఘనంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

6
0
  • విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ఆరు ముఖ్యాంశాలు
  • వివరణాత్మకంగా వివరించిన శాస్త్రవేత్తలు
  • డా కృష్ణ తేజ, డా శ్రీజన్

అశ్వారావుపేట, ఆర్గాన్ న్యూస్, మే 14:

అశ్వారావుపేట మండలం పరిధిలో కావడిగుండ్ల గ్రామం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమం లో డాక్టర్ కృష్ణ తేజ, శ్రీజన్ మాట్లాడుతూ విశ్వ విద్యాలయం వారు ఇచ్చిన ఆరు ముఖ్యంశాలతో పాటు కొన్ని అంశాలు వివరించారు. రైతులు విలువ ఆధారిత ఉత్పత్తులను రైతు సహకార సంఘాల ద్వారా విక్రయించుకుంటే మంచి ధర ని పొందవచ్చని, రైతు కేవలం ఒక వ్యవసాయదారుడిగా కాకుండా ఒక వాటాదారుడిగా ఆలోచించాలని చెప్పారు.
సేంద్రీయ ధృవీకరణ , డ్రిప్ ఇరిగేషన్, నీటి కుంటల ఏర్పాటు, తక్కువ నీటి తో పండే ఉద్యాన పంటల గురించి చర్చించారు.
ఈ కార్యక్రమం లో సర్పంచ్ బడిస లక్ష్మణ్ రావు, రైతులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.